వస్పుల గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న CWC ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నేడు మిడ్జిల్ వస్పుల గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం CWC ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి గారు,ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు పాల్గొన్నారు…

సందర్భంగా వంశీచందర్ రెడ్డి గారు మాట్లాడుతూ…

రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించే దిశగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు…

ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు…

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని అసలైన అర్హులకు 6 గ్యారంటీ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *