విజేతలుగా నిలిచినా టీం కు బహుమతులు అందించిన యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలంలోని అముదబండ తండాలో కబడ్డీ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్‌కి మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి హాజరయ్యారు. విజేతలుగా గెలిచినా టీంకు బహుమతులు మరియు ప్రైజ్ మనీ అందించారు.

కబడ్డీ టోర్నమెంట్ లో విన్నర్ అప్ గ మనజీపేట టీమ్ నిలిచి ₹7,000 నగదు బహుమతిని సాయి చరణ్ రెడ్డి గారు అందజేశారు అదేవిదంగా రన్నర్ అప్ , డోంతికుంట తండా టీమ్ నిలిచి ₹3,000 నగదు బహుమతి పొందింది.

సాయి చరణ్ రెడ్డి గారి సౌజన్యంతో, ఈ టోర్నమెంట్ స్థానిక క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, గ్రామాల ఐక్యతను బలోపేతం చేసింది. ఈ సందర్భంగా ఆయన క్రీడాస్ఫూర్తి మరియు యువత అభివృద్ధిపై ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

క్రీడల ప్రోత్సాహానికి సహకరించిన సాయి చరణ్ రెడ్డి గారికి టోర్నమెంట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసారు