వేసవిలో తాగునీటి ఇబ్బంది లేకుండా పరిష్కరించాలి , అధికారులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి,సన్న బియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పంపిణీ చేయాలి,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రాజీవ్ యువ వికాసంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలి.
అచ్చంపేట డివిజన్ అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశo నిర్వహించి అధికారులు, ఆయా మండలాలకు చెందిన నాయకులతో హైదరాబాద్ నందు సమీక్ష సమావేశం నిర్వహించి.
ఈ సమావేశం నందు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని, మిషన్ భగీరథ, RWS, అధికారులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎవరూ కూడా ఈ మూడు నెలలు నిర్లక్ష్యం చేయకుండా పనులలో నిమగ్నం కావాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షించారు. హౌసింగ్ అధికారులతో నిర్మాణంపై త్వరగా పనులు జరిగే విధంగా ఆదేశించారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని పార్టీ లీడర్లు అందరు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలందరూ సమక్షంలో పండుగ వాతావరణం కల్పించే విధంగా ప్రారంభోత్సవం నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు, మండల స్థాయి MPDOలతో మాట్లాడుతూ రాజీవ్ వికాసం అదేవిధంగా గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు అన్ని స్థాయిల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసుకోవాలని సూచించడం జరిగింది.