శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి దంపతులు

శ్రావణమాస చివరి శనివారం రోజును పురస్కరించుకుని నేడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తన సతీమణి శారదా రెడ్డి కుమారుడు నవనీత్ రెడ్డిలతో కలిసి వనపర్తి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా వేద పండితులు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వాదాన్ని అందించారు

అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.