సన్మాన సభ కార్యక్రమం

శ్రీ లక్ష్మీ కృష్ణ గ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీస్ చైర్మన్ గా బాధితులు తీసుకొని మొదటిసారిగా వనపర్తికి వచ్చిన సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా స్వాగతం పలకడం జరిగింది.

గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది. అలాగే శివసేన రెడ్డి గారు గత పది సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ధర్నాలు చేస్తూ జైలు పాలు కావడం. నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ వారికి తగ్గకుండా పార్టీ గెలుపు కోసం కృషి నాయకుడు. అలాగే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

అలాగే శివసేన రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం గ్రామానికి చెందిన నాయకుడు కావున వారు వనపర్తి వనపర్తి నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూల్స్ గాని క్రీడలకు సంబంధించిన అన్ని వసతులను వనపర్తి నియోజకవర్గానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని వారిని కోరడం జరిగింది..