ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగ నిర్వహించిన సమీక్షా సమావేశం లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
నేడు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నీటి పారుదల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖలతో పాటు పలు శాఖలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు,దామోదర రాజనర్సింహ,నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారితో పాల్గొన్న పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులను మరియు పాఠశాలలలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారు. సంబంధిత అధికారులతో వాటి గురించి చర్చించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే గారు కోరారు.