వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి@megha_reddy_official గారు ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో గురువారం స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రామ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ దీని ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి చరణ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, వెంకట్రావు, రాములు నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, గ్రామ నాయకులు దుర్గయ్య, రవీందర్ రెడ్డి, బాలరాజు యాదవ్, మరియు సాక్షి గణపతి యువకులు చెన్నయ్య, నవీన్ రెడ్డి, రాజు, శివ, శివరాజ్, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.