ఖిల్లా ఘనపూర్ మండలంలోని సల్లెలాపూర్ గ్రామంలో మన ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి గారు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని గ్రామ అభివృద్ధికి తన కృషిని చూపించారు. గ్రామంలో రోడ్ల వెంట పేరుకున్న చెత్తను జనసేవి ట్రాక్టర్ సహాయంతో తొలగించి, రోడ్డు పక్కన ఉన్న మొక్కల రక్షణ కోసం అదనపు కోటలు ఏర్పాటు చేశారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించి, ప్రజల అభిప్రాయాలను తీసుకొని తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన సమయంలో మద్దతు అందిస్తూ, గ్రామాభివృద్ధిలో చురుకుగా పాల్గొంటున్న
సాయి చరణ్ రెడ్డి కార్యాచరణకు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.