సొంత నిధులతో పోలికే పహాడ్ మెయిన్ కెనాల్, బుద్దారం కుడి ఎడమ కాలువలను బాగు చేస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
➙ పూడికతీత పనులు
➙ చెట్ల తొలగింపు
➙ బ్యాంకింగ్ మరమ్మత్తులు
➙ రోడ్డు డైవర్షన్ వద్ద పైపు లైన్ల ఏర్పాటు కొనసాగుతుంది.
అన్నదాతల శ్రేయస్సునే పరమాదిగ భావించి పని చేస్తున్నారు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు
వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని పోలికేపహాడ్ మెయిన్ కెనాల్ తోపాటు బుద్ధారం కుడి ఎడమ కాలువల్లో భారీ ఎత్తున పేరుకుపోయిన మట్టి, కంప చెట్లను తొలగించి పాడైపోయిన బ్యాంకింగ్ ను బాగు చేయిస్తున్నారు.అలాగే
రోడ్ల డైవర్షన్ వద్ద పైప్ లైన్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు
ఈ కెనాల్లను బాగు చేయించడంతో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గోపాల్పేట, వనపర్తి, పెద్దమందడి ఖిల్లా ఘనపురం, మండల పరిధిలోని గ్రామాలకు నిరాటగంగా సాగునీరు అందుతుంది
రైతుల ఇబ్బందుల తెలిసిన వ్యక్తి వనపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం హర్షించదగ్గ విషయమని రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందుచూపుగా కెనాల్లా మరమ్మత్తులు చేపట్టడం రైతులకు ఉపయోగకరమని ఆనందం వ్యక్తం చేశారు.