స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాలి. అచ్చంపేట మండలం కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం హాజపూర్ చౌరస్తా ఫంక్షన్ హాల్ లో ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ సైనికులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.. ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి , అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు పెన్షన్లు , రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి మరియు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం , వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుంది వీటిని నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.