స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారి పదవి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు హాజరై శివసేన రెడ్డి గారిని సన్మానించి వారిని కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గౌరవ శ్రీ శివసేనరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో వనపర్తి నియోజకవర్గంలో క్రీడలకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను, సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానని శివసేన రెడ్డి గారు పేర్కొన్నారు..

ఈ సందర్భంగ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అతి చిన్న వయసు నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను నిరంతరాయంగా కృషి చేస్తూ గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు చురుకైన పాత్ర పోషిస్తు నేడు తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవప్రదమైన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు..