అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు.

అమ్రాబాద్ మండలం మన్ననుర్ ఐటిడిఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ & జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఐటీడీఏ పీవో రోహిత్ గోపిడి , ఆర్డీవో ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

మూలవాసులుగా, అమ్మలాంటి అడవికి తోడుండే భూమి పుత్రులుగా, కల్మశంలేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను

నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి చెంచులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్య వైద్యం పైనే ప్రధాన దృష్టి పెట్టి వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నాం.