అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువత

అచ్చంపేట పట్టణంలోని స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ యువకులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ శిబిరాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు.

తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా యువకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్త దానం చేసి ఒకరి ప్రాణాలను కాపాడడం మానవ సమాజానికి మానవత విలువలకు వారి ప్రాణాలను కాపాడడం ఎంతో అవసరంతనపై అభిమానంతో రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ప్రాణదాతలకు మారుతున్న ప్రతి ఒక్క యువకులకు నాయక ధన్యవాదాలు.

ఏప్పటికప్పుడు యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు రక్తదానం చేసిన యువకులకు అభిమానులకు పండ్లు మరియు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది.