అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంప్.

అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో రెండవ మెగా సర్జికల్ క్యాంపులో ఈరోజు ప్రారంభించిన .ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన ప్రజలు ఈ యొక్క సర్జికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు.

నల్లమల్ల ప్రాంతంలో పేద, తరగతి ప్రజలు వైద్య పరంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో రెండవసారి మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపును జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి వచ్చి ఈ యొక్క సర్జికల్ క్యాంపును పరిశీలించడం జరిగింది రెండోసారి సర్జికల్ క్యాంపు నిర్వహిస్తున్న.స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారిని మరియు వైద్య బృందాన్ని అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో , తారా సింగ్ హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ ప్రభు అర్ యం ఓ డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మహేష్, డాక్టర్ తేజస్విని , ఇతర డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ నర్స్ అసిస్టెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.