
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు భారీ నిరసన ర్యాలీ.అచ్చంపేట పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.నాగర్ కర్నూల్ MP #Drmalluravi గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డా.బి అర్ అంబేద్కర్ గారు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి ఆయనకు అవమానం జరిగితే మనందరికీ జరిగినట్లే.
భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి .అమిత్ షా వ్యాఖ్యలపై ఏఐసిసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.తక్షణం కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షా ను తొలగించాలి.అమిత్ షా వ్యాఖ్యలతో అంబేద్కర్ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైంది ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ అని మాట్లాడడం జరిగింది.