అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

పెబ్బేరు మండల కేంద్రంలోని శ్రీ సుంకులమ్మ ఆలయ కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న గుడికి తన సహాయం కావాలని పెబ్బేరు ప్రజలు, పెద్దలు ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే గారు 20రోజుల వ్యవధిలో కావలసిన నిధులను విడుదల చేయిస్తానని ఆలయ కమిటీ పెద్దలకు హామీఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు.