అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించిన సాయిచరణ్ గౌడ్

దేవి నవరాత్రుల సందర్బంగా… పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో పటాన్చెరు బీఆర్ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ పాల్గొన్నారు. అమ్మవారి మండపాలలో ప్రత్యేక పూజలు జరిపించుకుని, భక్తులతో కలసి వేడుకల్లో భాగమయ్యారు. అమ్మవారి దివ్యకటాక్షం అందరిపై ఉండి సుఖశాంతులు, ఐశ్వర్యం నింపాలని ఆయన ఆకాంక్షించారు.