వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రులు పలు సమస్యలను గుర్తించి పరిశీలించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
శిధిలావస్తలో ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు విభాగాలు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో ఆసుపత్రి సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలలో కురుస్తున్న వర్షపు నీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి కావలసిన నివేదికలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించే జిల్లా ఆస్పత్రి ఈ తరహాలో ఉంటే ప్రజారోగ్యాన్ని ఏ విధంగా కాపాడగలమని అధికారులను ఆయన ప్రశ్నించారు.సత్వరమే ప్రభుత్వాసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి కావలసిన నివేదికలను తయారుచేసి తన అందించాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.