ఇఫ్తార్ విందులో పాల్గొన్న వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. సాయి చరణ్ రెడ్డి గారు

వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. సాయి చరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖిల్లా ఘనపుర్ మండలం సోఫియా మసీద్ లో ఈరోజు గురువారం నాడు ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణం, ఖిల్లా ఘనపుర్ మండలం ముస్లిం సోదరులు పాల్గొని, సాయి చరణ్ రెడ్డి గారి సామాజిక సేవను ప్రశంసించారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినందుకు ముస్లిం సోదరులు సాయి చరణ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘనపుర్ పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.