ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది ఇందులో భాగంగా ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి మరియు ఇతర అధికారులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని జరుగుతున్న పెండింగ్ పనులను అడిగి తెలుసుకున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో పెండింగ్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పెండింగ్ పనులను గౌరవ మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందికె ఎల్ ఇ కాలువ నుండి అచ్చంపేట నియోజకవర్గానికి ప్యాకేజ్ -29 ప్యాకేజ్-30 కాలువలు గత కొన్ని రోజుల నుండి కురిసిన వర్షాలకు దెబ్బ తినడం జరిగింది వాటికి మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని గౌరవ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అచ్చంపేట నియోజకవర్గానికి రెండు లేదా మూడు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.