ఎర్రవల్లి జనజాతర భారీ బహిరంగ సభ

ఎర్రవల్లి జనజాతర భారీ బహిరంగ సభకు హాజరై కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.

ఎర్రవల్లి జనజాతర భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు…

ఈనెల 13న జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ మల్లు రవి గారి మెజారితో గెలిపించాలని అలాగే కొంతమంది బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారి మాటలు వినకండి అంటూ

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేస్తుంది అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

అలాగే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్రంలో మనం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రకటించిన ఐదు గ్యారెంటీ లను కూడా ప్రజల్లోకి తీసుకువస్తామని ప్రజలందరికీ న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగిది.