బీఆర్ఎస్ ది నీచ రాజకీయం – ఎస్ ఎల్ బి సి ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్న BRS నాయకులు శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్ చేస్తోంది. పరోక్షంగా ఈ యొక్క ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకొని మీడియా సమావేశంలో మాట్లాడుతున్న.
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్ చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలోఆరుగురు చనిపోతే పరామర్శించలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎస్.ఎల్.బి.సి ప్రమాదం జరిగిందని ఎంఎల్ఏ డా చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోయారని, కనీసం కేసీఆర్ అక్కడకు వెళ్లలేదన్న విషయాన్ని MLA వంశీకృష్ణ గుర్తు చేవారు. ఇప్పుడు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న డా.వంశీకృష్ణ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎనిమిది మందిని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నేతలు జరిగిన ప్రమాద సంఘటనపై రాజకీయం మానుకొని సలహాలు సూచనలు ఇవ్వాలి … ప్రమాదం పై అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెపుతారు .