కళ్యాణ లక్ష్మి/ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది

కళ్యాణ లక్ష్మి/ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది. ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . లబ్ధిదారులతో *ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ* గారు వీడియో కాల్ లో మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలందరూ కూడా ఇది వరం లాంటిది.

త్వరలోనే అచ్చంపేట కు రావడం జరుగుతుంది.. యధావిధిగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి వాటిలో పాల్గొంటూ నిరంతరం అచ్చంపేట ప్రజల అభివృద్ధికై పాటుపడడం జరుగుతుందని లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ చిక్కుడు అనురాధ జడ్పిటిసి సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆర్డిఓ , తాసిల్దార్ అన్ని మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు లబ్ధిదారులు పాల్గొన్నారు.