ప్రభుత్వ పాఠశాలలైన కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని పరిశీలించిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లోని కస్తూరిబాగాంధీ విద్యాలయాలను ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు సందర్శించి పరిశీలించారు.అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాల లోని సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు అలాగే పిల్లలకు మంచి శిక్షణ అందించాలని మరియు నాణ్యతమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని వారు పేర్కొన్నారు.