వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం , మంగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల , నాయకుల ప్రత్యేక సమావేశాన్ని మేఘా రెడ్డి ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గాని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి గారి మన్ననలను పొందిన ఎమ్మెల్యేగా వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక గుర్తింపును పొందారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు పేర్కొన్నారు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి గారు గొప్ప నిబద్ధతగల నాయకుడని ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప ఎక్కడ ఎలాంటి ఆలోచన లేని వ్యక్తులలో మేఘారెడ్డి ఒకరిని మల్లు రవి పేర్కొన్నారు వనపర్తి నియోజకవర్గంలో మేఘా రెడ్డి నిర్వహించే కార్యక్రమాల వల్ల ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుందని ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ఏ నాయకుడైన గొప్ప లీడర్ గా తయారవుతాడని ఆయన అన్నారుఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి పనులు చేయాలో అలాంటి పనులు మేఘా రెడ్డి గారు చేసి చూపుతున్నారని కేవలం ఏడాది కాలంలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఆయన గంటపదంగా పేర్కొన్నారుఎంపీగా గెలిచిన వెంటనే వనపర్తి నియోజకవర్గాన్ని ప్రత్యేక అసెంబ్లీగా గుర్తింపు తీసుకువచ్చేందుకు మొదటి ప్రయారిటీగా వపర్తిని తీసుకుంటానని ఆయన పేర్కొన్నారుఈ సందర్భంగా ఖిల్లాఘన్నపురం మండలం అల్లమాయపల్లి గ్రామానికి చెందిన BRS నాయకులు కార్యకర్తలు మల్లు రవి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ కార్యక్రమంలో పెద్దమందడి ఖిల్లాఘన్నపురం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
