కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీఠ

పెబ్బేరు మండల కేంద్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి తోపాటు ముఖ్య అతిధిగా హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని క్రీడలతోనే ఉన్నత స్థాయి గుర్తింపు వస్తుంది.

అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి మండల కేంద్రంలో ఒక ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరిగింది.

అనంతరం పి. జె. పి. ఫుట్ బాల్ క్రీడా మైదానం లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారితో కలిసి జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్యను సన్మానించి అభినందించడం జరిగింది.

అలాగే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే అయినా మేఘా రెడ్డి గారికి ఫుట్బాల్ అసోసియేషన్ సన్మానం చేశారు.