కార్నర్ మీటింగ్

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేర్ మండల్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసి మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ..

పార్లమెంటు ఎన్నికల తరవాత దేశంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, దేశ భవిష్యత్తు మారనుందని.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ సంపదను పేదలకు పంచకుండా అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు పంచుతున్నాడని అన్నారు.

దేశ ప్రజలంతా కాంగ్రెస్ను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి ఆ సంపదనంతా తిరిగి పేదలకు పంచుతాడని, ఆ పూచీ కాంగ్రెస్ దని చెప్పారు.

రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఆశ పడ్డాం.. కానీ పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల బతుకులు మారలేదని, బానిసత్వంలో బతికామని గుర్తు చేశారు.

దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాలంటే 13న జరగనున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను నెరవేర్చిందని, ఎన్నికల కోడ్ వల్ల అమలులో కొంత జాప్యం ఏర్పడిందని చెప్పారు. ఆగస్టు 15న రైతులకు రుణమాఫీ కూడా నెరవేరుస్తామని చెప్పారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ 5 గ్యారెంటీలు ఇచ్చారని, అందులో దేశంలోని ఆడపడుచులందరికీ సంవత్సరానికి రూ. లక్ష ఇచ్చి ఆదుకుంటామని మాట ఇచ్చారని, కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పారు.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే వనపర్తికి రైల్వే లైన్ వస్తది.. నవోదయ పాఠశాల, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లు వస్తాయని చెప్పారు. మల్లు రవి గెలిస్తే ఢిల్లీలో పెద్దల నుంచి అవన్నీ సాధిస్తాడు కావున 13న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ చూసి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల వాళ్లు ఆమినేషన్ వేయాలంటే భయపడాలని అన్నారు.