కొల్లూరు గ్రామ శ్రీ శ్రీ శ్రీ చింతలపూరి మఠం ముఖద్వారాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…

గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

నవాబ్ పేట్ మండలంలోని కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ శ్రీ శ్రీ చింతలపూరి మఠం ముఖద్వారం ప్రారంభోత్సవం, షష్టిపూర్తి మహోత్సవం,216 హోమ గండములచే రుద్రయాగం మరియు ధర్మజాగృతి సభకు నేడు రాష్ట్ర రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ గార్లతో కలిసి ముఖద్వారాన్ని ప్రారంభించారు…

అనంతరం మంత్రిగారు ఎమ్మెల్యేలతో కలిసి గ్రామంలోనీ శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

సందర్భంగా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు…

మంత్రిగారు మాట్లాడుతూ… 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఎమ్మెల్యేలు ప్రజలకు అభివృద్ధి చేయడంలో విఫలమై ల్యాండ్, స్యండ్ మాఫియాలో ముందుకు కొనసాగారని అన్నారు… మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిందని అన్నారు…

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వారికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. మా నూతన ప్రభుత్వంలో మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గానీ అధికారులను ప్రజల దగ్గరికి తీసుకెళ్లి పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు…

ఈ ధర్మజాగృతి సభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి గారు, వీర్లపల్లి శంకర్ గారు, మధుసూధన్ రెడ్డి గారు పాల్గొన్నారు…

#Navabpet #Kollur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *