ఓపెన్ టు ఆల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు.క్రీడలు స్నేహభావానికి ప్రతీకలని క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శరీర దేహదారుద్యం పెంపొందితోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కుప్పిరెడ్డి వరలక్ష్మి కుమారులు అశోక్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తన తండ్రిగారైన కీర్తిశేషులు కుప్పిరెడ్డి చంద్రారెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్న ఓపెన్ టు ఆల్ క్రికెట్ పోటీలను బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గార్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్దమందడి ఎంపీపీ రఘు ప్రసాద్, ఎంపిటిసి సాయిభార్గవి, రాజశేఖర్ శెట్టి, దామోదర్, మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, సిద్దయ్య, నాయకులు సుదర్శన్, శేఖర్ రెడ్డి, గట్టు యాదవ్ తిరుపతిరెడ్డి నరసింహారెడ్డి,యువకులు భాస్కర్ రెడ్డి కురుమూర్తి రాజ వర్ధన్రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.