గౌరవ వనపర్తి శాసనసభ్యులు తుడి మెగా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖిల్లా ఘనపూర్ మండల పరిధిలోని కర్ణ తాండ, షాపూర్, సోలిపూర్, ఉప్పరపల్లి, సురాయిపల్లి, రుక్కనపల్లి, డీకే తండా, గట్టిగాడపల్లి, అంతాయిపల్లి గ్రామాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు.
దేశంలో మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడుగు, బలహీన వర్గాల పేదలకు ఈ పథకం ద్వారా ఆహార భద్రతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ మహత్కార్యాన్ని ఈ రోజు గ్రామాల్లో ప్రారంభించినందుకు గ్రామ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సభ్యులకు, మరియు వనపర్తి శాసనసభ్యులు తుడి మెగా రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి సీనియర్ నాయకులు సాయి చరణ్ రెడ్డి గారు, మండల స్థాయి నేతలు, కార్యకర్తలు, అన్ని గ్రామాల పెద్దలు, యువత, మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
