వనపర్తి జిల్లా కేంద్రాల్లో నల్లచెరువులో వ్యక్తి గల్లంతు సంఘటన స్థలంలో గౌరవ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పరిశీలనగాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.మంగళవారం మధ్యాహ్నం వనపర్తి పట్టణం నల్లచెరువులో స్నానం చేసేందుకు వెళ్లి వనపర్తి రాయిగడ్డకు చెందిన ఉందే కోటి కృష్ణయ్య గల్లంతయ్యారు. అతడి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.బుధవారం ఉదయం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు సంఘటన స్థలం నల్లచెరువుకు చేరుకొని గాలింపు చర్యలను పరిశీలించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలింపు చర్యలను ముమ్మరం చేసి గల్లంతయిన వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని అధికారులు ఆదేశించారఇలాంటి సంఘటనలు వేసవికాలంలోనే ఎక్కువగా జరుగుతుంటాయని తల్లిదండ్రులు వారి పిల్లలను ఒంటరిగా ఈతకు గానీ చేపల వేటకు గాని పంపకూడదని ఆయన సూచించారు