గుడ్ మార్నింగ్ వనపర్తి

గుడ్ మార్నింగ్ వనపర్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారితో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు.

నేడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ వనపర్తి కార్యక్రమం నర్సింగపల్లి వైశ్య నాయక్ తండా లో ప్రజల తో మమేకమై వారి సమస్యలు గురించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గారు అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ఐదు గ్యారంటీలను ప్రజలకు తెలియచేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అండగా ఉంటుందని కావున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు ప్రజలను కోరారు.