గురుపూజోత్సవం సందర్భంగా అచ్చంపేట పట్టణంలోనీ BK గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

తెలంగాణ ఉద్యమంలో ప్రతీ పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులే, నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో ఉపాధ్యాయుల సహకారం ఉంది, రాష్ట్రంలో పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదు 2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు, ప్రజా ప్రభుత్వం కొలువుతీరగానే.. 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశాం, డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఆనాటి పాలకులకు ఎందుకు రాలేదు..? విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని వాళ్లు ప్రయత్నించారు. ప్రొఫెసర్లను నియమించకుండా… యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారు.

మనం వచ్చాక మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేశాం.తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సేవలు అవసరం. చదువొక్కటే పేదల తల రాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుంది, పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయండి. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయి. త్వరలో తెలంగాణకు నూతన ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది. పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ పాలసీ ఉంటుంది. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి తప్పుదారిలో పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. అందరం కలిసి అద్భుతమైన తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం.