గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
గురు పౌర్ణమి సందర్భంగా పెబ్బేరు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేయడం జరిగింది
అలాగే పెబ్బేరు మండల కేంద్రంలోని నిర్మలాచల రాజయోగ ఆశ్రమం సందర్శించి అక్కడి కాశీ విశ్వేశ్వర బాలబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆశ్రమం వారు పలు సమస్యలు పరిష్కరించాలని తమ దృష్టికి తీసుకురాగా అందుకు స్పందించి రూ 5 లక్షల కు సంబంధించిన పనులను చేపట్టాలని మండల నాయకులకు సూచించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సత్యనారాయణ, నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, రాములు యాదవ్, చీర్ల శేఖర్, మణిగిల్ల తిరుపతిరెడ్డి షకీల్, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు