గ్రామాల్లో పనుల జాతర ప్రారంభం

గ్రామాల్లో పనుల జాతర ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో పల్లెల్లో పనుల జాతరకు రంగం సిద్ధమైంది వంగూర్ మండల మిట్ట సదగొడు గ్రామాoలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది.అచ్చంపేట నియోజకవర్గంలో మిగతా మండలాల్లో గ్రామాల్లో కూడా పనుల జాతర కొనసాగనుంది.

గ్రామాల, పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు నుండి గ్రామాల్లో పనుల జాతరను ప్రారంభించింది పనుల జాతరలో ఉపాధి హామీ పథకం గ్రామీణ రహదారుల నిర్మాణం గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు వివిధ సంక్షేమ పథకాలకు భవన నిర్మాణాల పనులను ఈ కార్యక్రమంలో చేపాడటం జరుగుతుంది.