ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబి వేడుకలు

మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో ఆదివారం మిలాద్‌ ఉన్‌ నబి వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పటాన్చెరు బీఆర్ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాయిచరణ్ గౌడ్ మాట్లాడుతూ… మహ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుతున్నానని అన్నారు. అక్కడ జరిగిన రక్తదానం శిబిరంలో పాల్గొని, ముస్లిం సోదరులకు ఆటపాటలు నిర్వహించారు. ముస్లిం సోదరులు సాయిచరణ్ గౌడ్ కీ ఘనంగా సన్మానం చేశారు.