పెబ్బేరు మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 141 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పొందాలంటే నెలలు నెలలు ఎదురు చూడాల్సి వచ్చేదని, వనపర్తి జిల్లా క్యాంప్ కార్యాలయం ముందు పడిగాపులు కాసే దుస్థితి ఉండేదని, నేడు అలాంటి దుస్థితి ఉండదని ఏ మండల కేంద్రంలో ఎక్కడికక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తారని ఆయన చెప్పడం అలాగే సంక్రాంతి పండగ ముందు మీకు చెక్కులను అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు