ఆసుపత్రిలోని సిబ్బంది, విద్యుత్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రి లోని జరిగిన విద్యుత్ సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు నిర్దేశించారు.
తొందర్లోనే నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటుచేసి వాటి ద్వారా ఆసుపత్రికి కరెంటు సరఫరా చేసి మరల ఆసుపత్రిలో విద్యుత్ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
