ఈరోజు ఉదయం అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, హాస్పిటల్ సూపర్డెంట్, వైద్య సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
విజయవంతంగా నిర్వహిస్తున్న మూడవ విడత మెగా సర్జికల్ క్యాంపు చివరి దశలో పేర్లు నమోదు చేసుకొని మిగిలిన వారికి ఈనెల 10వ తేదీన శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుంది. కావున నల్లమల అచ్చంపేట పరిసర ప్రాంత ప్రజలు యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి చేస్తున్న.
పేర్లు నమోదు చేసుకున్న వారు 9వ తేదీన హాస్పిటల్ లో జాయిన్ అయి అన్ని రకాల వైద్య పరీక్షలు చేపించుకొని 10వ తేదీ రోజున నిర్వహించే సర్జికల్ క్యాంపుకు రాగలరని మనవి చేస్తున్న.