పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్యన కోలాటం ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పింపించడం జరిగిది.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం వారి ఆశయాల సాధన కోసం కట్టుబడి ఉన్నామని సూచించడమే అవుతుందని మనం ప్రతి ఒక్కరం మహానుభావుల ఆశయాల సాధన కోసం పాటుపడాలి.అన్నిఅంబేద్కర్ విగ్రహం వద్ద తాను హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో పెబ్బేరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ నాయకులు భాస్కర్ నాగరాజు కోటి శ్యాము మండల నాయకులు సురేందర్ గౌడ్ రంజిత్ కుమార్ భాను ప్రకాష్ రెడ్డి కంచరపల్లి గ్రామ పెద్దలు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.