తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు. కొల్లూరు ఫేజ్-1 డబుల్ బెడ్రూం ప్రాంగణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి గారితో కలిసి బిఆర్ఎస్ యువ నాయకుడు సాయిచరణ్ గౌడ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సాయిచరణ్ గౌడ్ మాట్లాడుతూ…. మతపరమైన ఐక్యత, సోదరభావం, సేవామార్గం గురించి హజ్రత్ మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.