బావాజిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయం మరియు ద్వజ స్థంభం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి గారు, అనిరుధ్ రెడ్డి గారు…
ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు…
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట్ మండలంలోని బావాజిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రమణ్య స్వామి, నవగ్రహ మూర్తులు, నాగ ప్రతిష్ట దేవాలయం మరియు ద్వజ స్థంభం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి గారు, అనిరుధ్ రెడ్డి గారు పాల్గొన్నారు…
