నల్లమల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం శ్రీ పబ్బతి మద్దిమడుగు ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు.

నల్లమల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం , పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన పిలిస్తే పలికే భక్తుల కొంగుబంగారం గా పిలువబడుతున్న శ్రీ పబ్బతి మద్దిమడుగు ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు.

అంగరంగ వైభవంగా జరుగున్నా సందర్భంగా పాల్గొని శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ హనుమాన్ గాయత్రి మహా హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సీతారాముల కళ్యాణ మహోత్సవం గరుడవాహన సేవ నిన్న రాత్రి 9:30 నిమిషాలకు హనుమాన్ మహా పడిపూజ కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేక పూజలతో పాటు మన్య సూక్తములతో ఆంజనేయ స్వామి వారికి 108 కలశములచే మహా స్నానం నిర్వహించడం జరిగింది.