నులిపురుగుల నివారణ కార్యక్రమం

నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు నూతన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని గారు.

నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు పిలుపునిచ్చారు. నేడు వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్ర వేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

నులిపురుగుల మాత్రను 1-19 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని, ఈ మాత్రలు ప్రభుత్వం ఉచితంగానే పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు అలాగే నులి పురుగులు చాలా ప్రమాదకరమని, వీటితో రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తు తాయని వీటిని నివారిస్తే ఆరోగ్యంగా వుండవచ్చునన్నారు.ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.