నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి బస్సు నడిపిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

వనపర్తి కలెక్టరేట్ నుంచి గోపాల్పేట్ మండల కేంద్రం వరకు ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ప్రధాన కళాశాలలు, పాఠశాలలు ఈ మార్గంలో ఉన్నందున రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సును ప్రారంభించడం జరిగింది.

అలాగే బస్సు రిబ్బన్ కట్ చేసి పట్టణంలో 10 కిలోమీటర్లు బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు… ఎమ్మెల్యే డ్రైవింగ్ చేస్తున్నాడన్న విషయం ఒక్క నిమిషంలో పట్టణ మొత్తంలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ప్రజలతో మమేకమే ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి వనపర్తి ఎమ్మెల్యేగా రావడం వనపర్తి నియోజకవర్గానికి శుభసూచకమని వారు ఎమ్మెల్యే గారిని అభినందించారు