పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ రివ్యూ మీటింగ్

అచ్చంపేట నియోజకవర్గ పంచాయతీ రాజ్ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాదులోని తన ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

•అచ్చంపేట నియోజకర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు,పెండింగ్ వర్క్స్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

•నియోజకవర్గంలోనీ రోడ్లు, పెండింగ్ పనులపై చర్చించి పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు.

•అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.