పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి . పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కు విద్యాధికారులు కృషి చేయాలి . అచ్చంపేట పట్టణంలో జరిగిన అచ్చంపేట నియోజకవర్గ విద్యాభివృద్ధిపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
అచ్చంపేట నియోజకవర్గంలో రానున్న పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఎంఈఓ లకు ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశించారు.
నియోజకవర్గంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతులైన తాగునీరు, టాయిలెట్లు అలాగే అవసరమైన చోట నూతన పాఠశాల భవనాలు నిర్మాణం చేయుటకు సంబంధించిన విషయాలను ఒక నివేదిక రూపంలో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ ల ద్వారా నా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఆ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేసి విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అన్ని మండలాల ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు గెజిటెడ్ హెడ్మాస్టర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పాల్గొన్నారు.