ఖిల్లా ఘనపూర్ మండలం, పర్వతాపురం గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచిన నాగవరం జట్టుకు ₹15,000 నగదు బహుమతిని, రన్నరప్‌గా నిలిచిన పర్వతాపురం జట్టుకు ₹10,000 నగదు బహుమతిని అందజేశారు.
విజేత మరియు రన్నరప్ జట్లకు బహుమతులు మరియు షీల్డులను సాయి చరణ్ రెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా సాయి చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ, క్రీడలు యువతలో ప్రేరణను కలిగించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు కూడా పాల్గొని జట్లను అభినందించారు.