పాత్లవత్ శ్రీను కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలం, దొంతికుంట తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయి చరణ్ రెడ్డి గారు, పాత్లవత్ శ్రీను అకాల మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీకి పాత్లవత్ శ్రీను అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

శ్రీను పార్టీ కోసం చేసిన కృషిని గౌరవిస్తూ, సాయి చరణ్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి ₹5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీను చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు