పార్లమెంట్,  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి

 మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసినా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘారెడ్డి గారు పాల్గొని మాట్లాడారు గత పది సంవత్సరాల BRS పాలన మొత్తం అవినీతి అక్రమాలతో నిండిందని అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ నీ జిల్లా ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించడం దానికి నిదర్శనం అన్నారు. BRS ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిందని ప్రాజెక్టుల విషయంలో వివక్షచూపారన్నారు.కమీషన్లపేరిట ప్రజాధనం లూటీచేశారన్నారు